కీలక నిర్ణయం తీసుకున్న భారత్
- March 17, 2021
న్యూఢిల్లీ:కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.ఆధార్ తో ఓటర్ ఐడీని అనుసంధానం చేస్తున్నట్టు పార్లమెంటులో ప్రకటించింది.డీఎంకే ఎంపీ దయానిధి మారన్ వేసిన ప్రశ్నకు లోక్ సభలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమాధానమిస్తూ…. ఓటర్ ఐడీకి ఆధార్ నంబరును అనుసంధానం చేస్తామని చెప్పారు.దీనివల్ల ఓటు హక్కు పరిరక్షణకు వీలవుతుందని అన్నారు. ఎవరు ఓటు వేశారో, ఎవరు వేయలేదో తెలుసుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పారు.
ఓటర్ ఐడీకి ఆధార్ ను అనుసంధానం చేయాలనే డిమాండ్లు ఎప్పటి నుంచో వినపడుతున్నాయి.ఆధార్ తో అనుసంధానిస్తే నకిలీ ఓట్లు తొలగిపోతాయని కేంద్ర ఎన్నికల సంఘం కూడా అభిప్రాయపడింది.ఓటర్ ఐడీని ఆధార్ తో అనుసంధానం చేస్తే… నకిలీ ఓట్లను సులభంగా తొలగించవచ్చు.ఒక్కొక్కరు కేవలం ఒక ఓటుకు మాత్రమే పరిమితమవుతారు. రెండు, మూడు చోట్ల ఓటరుగా నమోదు చేసుకోవడం కుదరదు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







