గల్ఫ్ కార్మికుల ఆశలపై కేంద్రం నీళ్లు
- March 17, 2021
*కార్మికుల ఎడారి రోదన పట్టని కేంద్రం
*తగ్గించిన కనీస వేతనాలు యథాతథమని పార్లమెంటులో ప్రకటించిన ప్రభుత్వం
న్యూ ఢిల్లీ:ఆరునెలల క్రితం సెప్టెంబర్ 2020 లో ఆరు అరబ్ గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికుల కనీస వేతనాలను (మినిమమ్ రిఫరల్ వేజెస్) తగ్గిస్తూ భారత ప్రభుత్వం జారీ చేసిన సర్కులర్లను రద్దుచేయాలని గల్ఫ్ కార్మికులు కొన్ని నెలలుగా చేస్తున్న విజ్ఞప్తులు ఎడారి రోదన గానే మిగిలిపోయాయి.
ప్రస్తుతానికి గల్ఫ్ కార్మికులకు కనీస వేతనాలను (మినిమమ్ రిఫరల్ వేజెస్) ను సవరించే ప్రతిపాదన ఏదీ లేదని, కోవిడ్ వలన ఉత్పన్నమైన ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని ఇటీవల సమీక్షించామని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి. మురళీధరన్ బుధవారం లోక్ సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
30 నుండి 50 శాతం వేతనాలను తగ్గిస్తూ జారీచేసిన సర్కులర్ల ప్రభావం రాబోయే కాలంలో గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న 88 లక్షల మంది భారతీయ కార్మికులు, ఉద్యోగుల ఆదాయంపై ప్రభావం చూపుతుందని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి అన్నారు. ఖతార్ ప్రభుత్వం అన్ని దేశాల కార్మికులకు 1,000 రియాళ్ళ కనీస వేతనం, వసతికి 500 రియాళ్ళు, భోజనానికి 300 రియాళ్ళు ఇవ్వాలని చట్టం చేసిందని, భారత ప్రభుత్వం తమ కార్మికులను 728 రియాళ్లకే (200 డాలర్లు) పంపిస్తామని చెప్పడం ఘోరమని భీంరెడ్డి అన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని కోరారు.


తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







