తెలంగాణ బడ్జెట్ 2021: వ్యవసాయరంగానికి కేటాయింపులు ఇవే
- March 18, 2021తెలంగాణ ఆర్థికమంత్రి హరీష్ రావు అసెంబ్లీలో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఏయే రంగానికి ఎన్ని కేటాయింపులు చేశారో చదివి వినిపించారు. తెలంగాణ బడ్జెట్ వార్షిక రూ.2,30,825.96 కోట్లు. రెవిన్యూ వ్యయం రూ.1,69,383.44 కోట్లుగా అంచనావేశారు. క్యాపిటల్ వ్యయం రూ.29,046.77 కోట్లు, రెవిన్యూ మిగులు రూ. 6,743.50 కోట్లుగా పేర్కొన్నారు. ఇక ఆర్థిక లోటు రూ..45,509.60 కోట్లుగా ప్రకటించారు. ఐతే బడ్జెట్లో వ్యవసాయంతో పాటు సాగు నీటి రంగానికి, సంక్షేమానికి పెద్దపీట వేశారు. బడ్జెట్లో రైతులపై వరాల జల్లు కురిపించింది రాష్ట్ర ప్రభుత్వం. రైతు బీమా నిధుల పెంపులతో పాటు రుణ మాఫీ గురించి ప్రకటన చేశారు మంత్రి హరీష్‌రావు ఆయిల్ పామ్ పంట వేసే రైతులకు ఎకరాకు రూ.30వేలు సబ్సిడీ. మిగిలిన పెట్టుబడి కూడా బ్యాంకుల నుంచి రుణం.
- పంటలను ఆరబెట్టేందుకు లక్ష మంది రైతులకు రూ.750 కోట్లు కేటాయింపు.
- ఈ ఆర్థిక సంవత్సరం వ్యవసాయ యాంత్రీకరణకు రూ.1500 కోట్లు
- ఈ ఏడాది రైతు బంధు కోసం రూ.14,800 కోట్లు కేటాయింపు
- గతంలో రూ.25వేల లోపు ఉన్న రుణాల మాఫీ. మిగతా రైతుల రుణమాఫీ కోసం రూ.5225 కోట్లు.
- రైతు బీమా కోసం రూ.1200 కోట్లు.
- పశు సంవర్ధకశాఖ, మత్సశశాఖకు బడ్జెట్లో రూ.1,730 కోట్లు కేటాయింపు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు