మూవీ రిలీజ్ సమయంలో కీర్తి సురేష్‌ ప్లాన్ చేసిన ప్రతీకారం..

మూవీ రిలీజ్ సమయంలో కీర్తి సురేష్‌ ప్లాన్ చేసిన ప్రతీకారం..

కీర్తి సురేష్‌, నితిన్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న చిత్రం రంగ్ దే. మార్చి 26న విడుద‌ల కానున్న ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ జోరుగా న‌డుస్తున్నాయి. తాజాగా కీర్తి సురేష్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఫ‌న్నీ వీడియో షేర్ చేస్తూ నెటిజ‌న్స్‌ను అల‌రించింది. వీడియోలో నితిన్ త‌ల‌ అటూ ఇటూ కదులుతూ ఉండగా, బ్యాక్‌గ్రౌండ్‌లో  ‘జిమ్మీ జిమ్మీ జిమ్మీ ఆజా’ పాట వ‌స్తుంది. ఈ వీడియోకు యానిమేష‌న్ ప‌ర్‌ఫెక్ట్‌గా యాప్ట్ కావ‌డంతో కామెడీ బాగానే జ‌న‌రేట్ అవుతుంది. ఈ వీడియోకు కీర్తి సురేష్ .. హాయ్ అర్జున్.. ఇదిగో నా పగ ప్రతీకారం… ప్రేమ..- అను” అంటూ రంగ్ దే చిత్రంలో వారి పాత్ర‌ల‌పై క్లారిటీ ఇచ్చింది.

రంగ్ దే చిత్రం ఓ షెడ్యూల్‌ని దుబాయ్‌లో జ‌రుపుకున్న విష‌యం తెలిసిందే.  షూటింగ్ బ్రేక్ స‌మ‌యంలో కీర్తి సురేష్ కునుకు తీయ‌గా, ఆమెను ఫొటో తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు నితిన్. మేము చెమ‌ట‌లు కారుస్తుంటే కీర్తి హ్యాపీగా నిద్ర పోతుంద‌ని పిక్‌కు కామెంట్ పెట్టాడు. అయితే దీనిపై స్పందించిన కీర్తి సురేష్.. షూటింగ్ మధ్యలో ఎప్పుడూ నిద్రపోకూడదనే పాఠం నేర్చుకున్నా. త‌ప్ప‌క రివెంజ్ తీర్చుకుంటా అని నితిన్ షేర్ చేసిన ఫొటోకు కామెంట్ పెట్టింది. ఇదంతా గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో జ‌ర‌గ‌గా, దానికి ప్ర‌తీకారం ఇలా తీర్చుకుంది కీర్తి సురేష్‌.  

Back to Top