తెలంగాణ బడ్జెట్ 2021: వ్యవసాయరంగానికి కేటాయింపులు ఇవే

- March 18, 2021 , by Maagulf
తెలంగాణ బడ్జెట్ 2021: వ్యవసాయరంగానికి కేటాయింపులు ఇవే

తెలంగాణ ఆర్థికమంత్రి హరీష్ రావు అసెంబ్లీలో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఏయే రంగానికి ఎన్ని కేటాయింపులు చేశారో చదివి వినిపించారు. తెలంగాణ బడ్జెట్ వార్షిక రూ.2,30,825.96 కోట్లు. రెవిన్యూ వ్యయం రూ.1,69,383.44 కోట్లుగా అంచనావేశారు. క్యాపిటల్ వ్యయం రూ.29,046.77 కోట్లు, రెవిన్యూ మిగులు రూ. 6,743.50 కోట్లుగా పేర్కొన్నారు. ఇక ఆర్థిక లోటు రూ..45,509.60 కోట్లుగా ప్రకటించారు. ఐతే బడ్జెట్‌లో వ్యవసాయంతో పాటు సాగు నీటి రంగానికి, సంక్షేమానికి పెద్దపీట వేశారు. బడ్జెట్‌లో రైతులపై వరాల జల్లు కురిపించింది రాష్ట్ర ప్రభుత్వం. రైతు బీమా నిధుల పెంపులతో పాటు రుణ మాఫీ గురించి ప్రకటన చేశారు మంత్రి హరీష్రావు ఆయిల్ పామ్ పంట వేసే రైతులకు ఎకరాకు రూ.30వేలు సబ్సిడీ. మిగిలిన పెట్టుబడి కూడా బ్యాంకుల నుంచి రుణం.

- పంటలను ఆరబెట్టేందుకు లక్ష మంది రైతులకు రూ.750 కోట్లు కేటాయింపు.
- ఈ ఆర్థిక సంవత్సరం వ్యవసాయ యాంత్రీకరణకు రూ.1500 కోట్లు
- ఈ ఏడాది రైతు బంధు కోసం రూ.14,800 కోట్లు కేటాయింపు
- గతంలో రూ.25వేల లోపు ఉన్న రుణాల మాఫీ. మిగతా రైతుల రుణమాఫీ కోసం రూ.5225 కోట్లు.
- రైతు బీమా కోసం రూ.1200 కోట్లు.
- పశు సంవర్ధకశాఖ, మత్సశశాఖకు బడ్జెట్‌లో రూ.1,730 కోట్లు కేటాయింపు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com