బడ్జెట్ లో కేటాయింపులు లేకుండానే గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి హామీలు

- March 18, 2021 , by Maagulf
బడ్జెట్ లో కేటాయింపులు లేకుండానే గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి హామీలు

హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీలో తేది: 18 మార్చి 2021 నాడు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఈ విధంగా పేర్కొన్నారు. 

గల్ఫ్ కార్మికుల సంక్షేమం

122 వ అంశం: తెలంగాణ ప్రాంతం నుండి బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ కార్మికులను సానుభూతితో ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఇందుకోసం కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేయడానికి ప్రత్యేక బృందం పర్యటించి వచ్చింది.ఆ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా రాబోయే రోజుల్లో గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  కేటాయింపులులేని హామీలతో కాలం వెళ్లదీయవద్దు అని ఇమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి అన్నారు.గల్ఫ్ తో సహా 18 కి పైగా దేశాలలోని కార్మికులకు ఉపయోగపడే విధంగా రూ.500 కోట్ల బడ్జెట్తో తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు (గల్ఫ్ బోర్డు) ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.2018 మార్చిలో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ.100 కోట్లు కేటాయించినప్పటికీ నిధులు ఖర్చు చేయలేదని భీంరెడ్డి గుర్తుచేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com