ఏపీ సర్కార్ కొత్త ఆదేశాలు
- March 18, 2021
అమరావతి:ఏ.పీలోనూ కోవిడ్ పెరుగుతూ వస్తున్నాయి.దీంతో.. అప్రమత్తమైన ప్రభుత్వం.. మరోసారి కోవిడ్ నిబంధనలు అమలు చేసే విషయంపై సీరియస్‌గా దృష్టిసారించింది.. ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాల్లో కోవిడ్ నిబంధనల్ని అమలు చేయాలని మరోమారు ఆదేశాలు జారీ చేసింది ఏపీ సర్కార్.. కరోనా రెండో దశ వ్యాపిస్తున్నందున్న నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. అవకాశం ఉన్నంత మేర వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని మరో మారు అవలంభించాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దేశంలోనూ రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా పరిశ్రమలు, దుకాణ సముదాయాలు, ఫ్యాక్టరీల్లో నియంత్రణా చర్యలకు ఆదేశాలు జారీ చేసింది.
రవాణా వాహనాలు, యంత్రాలు, ప్రాంగణాల్ని ఎప్పటికప్పుడు వైరస్ రహితంగా చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది ప్రభుత్వం... శానిటైజేషన్ ప్రక్రియను ఎప్పటికప్పుడు చేపట్టాల్సిందిగా స్పష్టం చేసింది.. వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలు, దుకాణాల్లోకి ప్రవేశించే సమయంలో థర్మల్ స్కానింగ్ చేయాల్సిందిగా సూచనలు చేసింది. మాస్కులు, శానిటైజేషన్, భౌతిక దూరం విధిగా పాటించేలా చూడాలని స్పష్టంగా తెలిపింది. డైనింగ్ హాళ్లు, క్యాంటీన్లలో ప్రతీ రెండు గంటలకూ శానిటేషన్ చేయాల్సిందిగా ఆదేశించిన సర్కార్.. ఉద్యోగులు, సిబ్బందికి వ్యాక్సినేషన్ వేయించేందుకు చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







