టోల్ వసూళ్లలో ఎలాంటి మార్పు లేదు: కేంద్ర మంత్రి
- March 18, 2021
న్యూ ఢిల్లీ:టోల్ గేట్స్ పై భారత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి కీలక ప్రకటన చేశారు. దేశంలో ఎక్కడా టోల్ గేట్స్ ఉండవని ప్రకటించారు.వచ్చే ఏడాదిలోపు..ఇది జరుగుతుందని, టోల్ వసూలు చేయరని..వాహనాన్ని జీపీఎస్ సిస్టం ఏర్పాటు చేస్తారు..దీని ద్వారా టోల్ వసూలు చేస్తారు. పార్లమెంట్ లో టోల్ ప్లాజాలపై సభ్యులు పలు ప్రశ్నలు వేశారు.దీనికి మంత్రి గడ్కరి సమాధానం ఇచ్చారు.
గత ప్రభుత్వాలు అన్యాయంగా..పట్టణ ప్రాంతాల్లో టోల్ ప్లాజాలు ఏర్పాటు చేశారని, టోల్ ప్లాజాలు తీసివేయడం ద్వారా..జాతీయ రహదారులపై ప్రయాణం సాఫీగా సాగుతుందని, వాహనాలను ఎవరూ ఆపేవారుండరు..దీంతో సమయం ఆదా కానుంది. రోడ్లపై కెమెరాలు ఏర్పాటు చేస్తారు..జీపీఎస్ సిస్టం..ద్వారా వాహనాన్ని ఫొటో తీస్తుంది. జాతీయ రహదారిపై వెళ్లే వాహనానికి ఆటోమెటిక్ గా పన్ను పడనుంది. ప్రస్తుతం జాతీయ రహదారులపై ఫాస్టాగ్ సిస్టం అమలవుతున్న సంగతి తెలిసిందే. ఫాస్టాగ్ ద్వారా..టోల్ ప్లాజాల వద్ద…భారీ క్యూ లైన్ లేకుండా..దోహదపడనుంది. ఈ సిస్టం ద్వారా..రోజు వంద కోట్ల మేర ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఫాస్ట్‌టాగ్ వాడకం గణనీయంగా పెరిగింది. అంతేకాకుండా ఈ మధ్య వస్తున్న ప్యాసింజర్, కమర్షియల్ వెహికిల్స్ దాదాపుగా జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ తో ఉన్నవనే సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







