ఏపీలో కరోనా కేసుల వివరాలు

- March 18, 2021 , by Maagulf
ఏపీలో కరోనా కేసుల వివరాలు

అమరావతి:ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గత కొన్ని రోజులుగా పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు.ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 31,165 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 218 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఒక్కరు కూడా మరణించలేదు. కానీ అదే సమయంలో 117 మంది రికవరీ అయ్యారు. దీంతో.. పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,92,740 కి చేరగా.. కోలుకున్నవారి సంఖ్య 8,83,759 కి చేరింది. ఇక, ఇప్పటి వరకు కరోనాతో 7,186 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,795 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com