'ఆత్మహత్యల నివారణ - జీవితం చాలా విలువైనది' అనే అంశంపై స్పందించిన రాష్ట్ర హోంశాఖ మంత్రి

- March 18, 2021 , by Maagulf
\'ఆత్మహత్యల నివారణ - జీవితం చాలా విలువైనది\' అనే అంశంపై స్పందించిన రాష్ట్ర హోంశాఖ మంత్రి

హైదరాబాద్: క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకునే వారు... వారి భవిష్యత్ తో పాటు కని,పెంచిన తల్లిదండ్రుల గురించి ఆలోచన చేయాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ కోరారు. ఆత్మహత్యల నివారణ- జీవితం చాలా విలువైనది అనే అంశంపై...  హైదరాబాద్ రవీంద్రభారతిలో స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సామెల్ రెడ్డి అధ్యక్షతన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి తో పాటు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ,మాధవి తో పాటు వివిధ కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పరీక్ష ఫలితాలు తప్పండం , ఉద్యోగం దొరకక , ప్రేమ విఫలమై ఇలా తదితర ఎన్నో కారణాలతో బ్రతుకు భారమనుకోని తొందరపాటు నిర్ణయాలతో జీవితాన్ని అర్దాంతరంగా ముగిస్తూ... తల్లిదండ్రుల కడుపుకోతకు కారణమవుతున్నారని హోంమంత్రి తెలిపారు. ఇటువంటి వారికి షీటీమ్ ఆధ్వర్యంలో... ముందస్తుగా ఆత్మహత్యల నివారణ కోసం కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు ముఖ్యంగా విద్యార్థిని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సామెల్ రెడ్డి కూతురు స్పందన ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన తర్వాత అలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు... గత 14నెలలుగా ప్రత్యేకంగా, పరోక్షంగా వేల మందికి ఆత్మస్థైర్యం నింపడంతో పాటు ఆత్మహత్యల నివారణ కోసం చేస్తున్న కృషిని మహమూద్ అలీ అభినందించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com