రమదాన్ నేపథ్యంలో కోవిడ్ కొత్త మార్గనిర్దేశకాలు జారీ చేసిన దుబాయ్

- March 18, 2021 , by Maagulf
రమదాన్ నేపథ్యంలో కోవిడ్ కొత్త మార్గనిర్దేశకాలు జారీ చేసిన దుబాయ్

దుబాయ్: పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో దుబాయ్ సుప్రీం కమిటీ కొత్త మార్గనిర్దేశకాలను జారీ చేసింది. ప్రార్థనలు, ఇఫ్తార్ విందుల నిర్వహణతో వైరస్ వ్యాప్తి మరింత వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయంటూ హెచ్చరించింది. కోవిడ్ ను అరికట్టేందుకు రమదాన్ మాసంలోనూ ఆంక్షల అమలు అనివార్యమంటూ పేర్కొంది. ముఖ్యంగా వృద్ధులు , దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సమాజ ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని సోషల్ గ్యాదరింగులపై నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. అలాగే రమదాన్ టెంట్లను, ఇఫ్తార్ విందులు, డొనేషన్ టెంట్లపై నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. ఇక తారవీ ప్రార్థనల సమయంలోనూ మసీదులలో కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించి తీరాల్సిందేనని దుబాయ్ సుప్రీం కమిటీ హెచ్చరించింది. ప్రార్థన సమయం 30 నిమిషాలకు పరిమితం చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలాఉంటే..ఎమిరాతి పరిధిలో కోవిడ్ తీవ్రతను పరిగణలోకి తీసుకొని రమదాన్ చివరి పది రోజుల ప్రార్థనలకు సంబంధించి నిర్ణయం తీసుకుంటామని సుప్రీం కమిటీ క్లారిటీ ఇచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com