పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ వేరిఫికేషన్ కోసం మున యాప్

- March 18, 2021 , by Maagulf
పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ వేరిఫికేషన్ కోసం మున యాప్

కువైట్: తమ దేశంలోకి వచ్చే వారు పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ తప్పనిసరి చేసిన కువైట్...ఫేక్ పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ లపై ఫోకస్ చేసింది. కొందరు వ్యక్తులు పీసీఆర్ నెగటీవ్ రిపోర్ట్ చూపిస్తున్న అవి నకిలీవని గుర్తించిన నేపథ్యంలో టెస్ట్ రిపోర్ట్ వెరిఫికేషన్ కు శ్రీకారం చుట్టింది. ఇందుకు మెడికల్ యుటిలిటి నెట్వర్క్ అక్రిడిటర్-మున యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రపంచంలోని పలు దేశాల్లోని ల్యాబరేటరీలను ఈ యాప్ ద్వారా లింక్ చేసింది. దీంతో పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ ఏ ల్యాబ్ పేరుతో ఉందో చెక్ చేసుకొని మునా యాప్ ద్వారా అది అసలైనదా..నకిలీదా గుర్తించవచ్చు. ఈ యాప్ లో లింక్ చేయబడిన నగరాల్లో భారత్ కు చెందిన 17 నగరాలు ఉన్నాయి. మెట్రోపాలిస్ హెల్త్ కేర్ లాబొరేటరీ లిమిటెడ్ నిర్వహణలో ఉన్న మంగుళూరు, కాలికట్, కనూర్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కొచ్చి, కోల్‌కతా, అహ్మదాబాద్, గోవా, తిరువనంతపురం ఉన్నాయి. ముంబై, నవీ ముంబై, పూణే లోని ది సబర్బన్ డయాగ్నోస్టిక్స్ లాబొరేటరీ..గురుగ్రామ్, నోయిడా, హైదరాబాద్ థైరోకేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ లాబొరేటరీలు మున యాన్ కు అనుసంధానించారు. అలాగే శ్రీలంకలోని 5 నగరాలు.. కొలంబో, నెగోంబో, గంపహాన్, కాండీ, కరైటియాలోని ల్యాబరేటరీలు లింక్ చేశారు. ఫిలిప్పీన్స్ లోని క్యూజోన్ సిటీ హై అక్యురెన్సీ డయాగ్నోస్టిక్ సెంటర్, ఫిలిప్పీన్స్ విమానాశ్రయంలో డయాగ్నొస్టిక్ ల్యాబరేటరీ, నేపాల్ లో అడ్వాన్స్ అండ్ మెడిసిన్ సర్జరీ(ఖట్మాండు), బంగ్లాదేశ్ లోని ఢాకాలో ప్రవా హెల్త్ ల్యాబరేటరీలను అనుసంధానించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com