2 క్రిమినల్ కేసుల విషయంలో సహాయపడిన కె9 యూనిట్

- March 19, 2021 , by Maagulf
2 క్రిమినల్ కేసుల విషయంలో సహాయపడిన కె9 యూనిట్

యూఏఈ: 2 నేరపూరిత కేసుల విచారణలో కె9 యూనిట్ సాయం తీసుకున్నట్లు దుబాయ్ పోలీస్ అధికారులు వెల్లడించారు. కె9 డైరెక్టర్ మేజర్ సలాహ్ ఖలీఫా అల్ మజ్రోయి 2019లో జరిగిన ఓ హత్య కేసు విషయంలో శిక్షణ పొందిన జాగిలాలు సాయపడినట్లు వెల్లడించారు. పాతిపెట్టబడిన మృతదేహాన్ని కనుగొనడంలో జాగిలాలు సాయం చేశాయి.మరో కేసులో డ్రగ్ రాకెట్ భగ్నం చేసే క్రమంలో అధికారులకు జాగిలాలు సాయపడ్డాయి. జబెయిల్ ఎయిర్ పోర్టులో ఈ ఘటన జరిగింది. మొత్తం 35.3 మిలియన్ క్యాప్టగాన్ పిల్స్ స్మగ్లింగ్ చేసేందుకు నిందితులు యత్నించగా కె9 యూనిట్ సాయంతో ఆ యత్నాన్ని అధికారులు భగ్నం చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com