దుబాయ్ లో ఏ.పీ వాసి ఆత్మహత్య...

- March 19, 2021 , by Maagulf
దుబాయ్ లో ఏ.పీ వాసి ఆత్మహత్య...

దుబాయ్:ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా కు చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.వివరాల్లోకి వెళ్తే...గోగినేని సత్య సాయినాథ్ అనే 25 సంవత్సరాల యువకుడు M.B.A పూర్తి చేసుకుని ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 19 జనవరి 2021 న యూఏఈ కి బ్రతుకు తెరువు కి వచ్చాడు.ఇక్కడ ఒక కంపెనీ లో ఉద్యోగంలో చేస్తున్నట్టుగా ఇండియా లో తల్లిదండ్రులకు తెలిపాడు.కానీ ఏమి అయ్యిందో తెలియదు కానీ ఉన్నట్టు వుండి 16 ఫిబ్రవరి నుండి ఫోన్ తలిదండ్రులకు రాకపోవడము తో, తల్లిదండ్రులు కంగారు పడుతూ తెలిసిన వాళ్ళతో సంప్రదించగా,16 వ తారీఖున సాయినాథ్ బలవన్మరణానికి పాల్పడినట్టు తెలిసింది. వెంటనే స్థానిక MLA అబ్బయ్య చౌదరి ద్వారా APNRTS చైర్మన్ వెంకట్ మేడపాటి వారి దృష్టికి తీసుకుని రావడముతో వారు యూఏఈ లో వున్న  APNRTS శాఖ ద్వారా మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేయడము జరిగింది.కానీ మృతదేహా నికి పంచనామాలో ఆ యువకునికి COVID Positive వుండడము వలన మృతదేహాన్ని పంపించడము కుదరలేదు.వెంటనే యూఏఈ లోని వివిధ భారతీయ మంత్రిత్వ శాఖలు మరియు, యూఏఈ ప్రభుత్వ సహకారాముతో ఆ యువకునికి వాళ్ళ తల్లిదండ్రుల పూర్తి ఆమోదంతో ఈ రోజున అంత్య క్రియలు జరిపారు.ఈ విషయములో సహాయసహకారములు అందించిన ఆనందకుమార్ (APNRTS Provisional Coordinator-UAE),మురళికు మృతుని తల్లితండ్రులు ధన్యవాదాలు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com