స్కూల్స్ లో 30% మంది విద్యార్ధులకే అనుమతి

- March 19, 2021 , by Maagulf
స్కూల్స్ లో 30% మంది విద్యార్ధులకే అనుమతి

ఖతార్:కోవిడ్ కేసుల నేపథ్యంలో స్కూళ్ల నిర్వహణపై ఖతార్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. పబ్లిక్, ప్రైవేట్ స్కూల్స్ సమయాలు, తరగతుల నిర్వహణ,బోధన విధానం, సెకండ్ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి పలు సూచనలు చేసింది. కోవిడ్ కేసుల తీవ్రత పెరుగుతుండటంతో స్కూల్ పూర్తి సామర్ధ్యంలో 30 శాతం విద్యార్ధులకు మాత్రమే ప్రత్యక్ష తరగుతులు నిర్వహించాలని సూచించింది. అలాగే ఒక్కో తరగతి గదిలో 15 మందినే అనుమతించాలని, అదీ కూడా ఒక్కో విద్యార్ధి మధ్య 1.5 మీటర్ల దూరం ఖచ్చితంగా పాటించేలా సీటింగ్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. కొత్త మార్గదర్శకాలు మార్చి 21 నుంచే అమలులోకి రానున్నాయి.  విద్యార్ధులు భౌతిక దూరం పాటించేందుకు అనువైన పరిస్థితులు కల్పించాలని, అవసరమైతే స్కూల్ ప్రాంగణంలోని గ్రౌండ్లో కూడా క్లాసులను నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది.30 శాతం మంది విద్యార్ధులకు మాత్రమే అనుమతి ఉండటంతో అందుకు అనుగుణంగా స్కూల్ సిబ్బంది తగిన ప్రణాళికను ముందస్తుగానే సిద్ధం చేసుకోవాలని..బ్యాచుల వారీగా క్లాసులు తీసుకోవాలని, 30 శాతం విద్యార్ధులు పోను మిగిలిన వారికి ఆన్ లైన్ ద్వారా పాఠాలు చెప్పాలని స్పష్టం చేసింది. అయితే..డైరెక్ట్ క్లాసులైనా, ఆన్ లైన్ క్లాసులైనా విద్యార్ధుల హజరు తప్పనిసరిగా ఉండేలా టీచర్లు జాగ్రత్తలు తీసుకోవాలని, ఒకవేళ అటెండ్ కాకపోతే వారి తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు సమాచారం అందివ్వాలని పేర్కొంది. గ్రామాల్లోని పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య తక్కువగా ఉండి భౌతిక దూరం పాటించేందుకు అనువుగా ఉంటే పూర్తిస్థాయిలో ప్రత్యక్ష తరగుతులు నిర్వహించొచ్చని ఖతార్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక స్కూల్ టైమింగ్స్ విషయానికి వస్తే యథావిధిగా ప్రతి రోజు ఉదయం 7.15 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుందని వెల్లడించింది.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com