విమాన ప్రయాణికులకు షాక్...

- March 20, 2021 , by Maagulf
విమాన ప్రయాణికులకు షాక్...

న్యూ ఢిల్లీ:విమాన ప్రయాణికులకు షాక్‌ తగలనుంది.విమాన టికెట్ల ధరల కనిష్ఠ పరిమితిని 5 శాతం మేర పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.విమాన ఇంధనం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి శుక్రవారం పేర్కొన్నారు.అయితే విమాన టికెట్ల ధరల గరిష్ట పరిమితిని మాత్రం యథాతథంగా కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.ఏటీఎఫ్‌ ధరల పెరుగుదల కారణంగా దేశీయ విమాన టికెట్ల ధరల కనిష్ఠ, గరిష్ఠ ధరల పరిమితులను గత నెలలో కేంద్రం 10-30 శాతం పెంచింది.గత ఏడాది మే నెలలో దేశీయ విమాన సర్వీసులను పునఃప్రారంభించిన సందర్భంగా విమాన ప్రయాణ సమయాన్ని బట్టి ఏడు శ్రేణులుగా వర్గీకరించి టికెట్ల ధరలపై పరిమితులు విధించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com