వ్యాక్సిన్ తీసుకుంటే నో క్వారంటైన్..పరిశీలిస్తోన్న కువైట్

- March 21, 2021 , by Maagulf
వ్యాక్సిన్ తీసుకుంటే నో క్వారంటైన్..పరిశీలిస్తోన్న కువైట్

కువైట్ సిటీ:వ్యాక్సిన్ తీసుకున్నవారికి క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్న పార్లమెంట్ సభ్యుల ప్రతిపాదనను కువైట్ ప్రభుత్వం పరిశీలిస్తోంది. వచ్చే సెషల్ లో క్వారంటైన్ నిబంధన కొనసాగించాలా...మినహాయింపు ఇవ్వాలనే దానిపై ఓ స్పష్టమైన ప్రకటన వెలువరించే అవశాలు ఉన్నాయి. అంతర్జాతీయ ప్రయాణ నిబంధనలను సులభతరం చేసేలా వ్యాక్సిన్ తీసుకున్న కువైట్ పౌరులకు క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇవ్వాలని పార్లమెంట్ సభ్యులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. కొరోనా పాస్ పోర్ట్ లను అనుమతించి వ్యాక్సిన్ తీసుకున్న వారికి ప్రయాణ నిబంధనలను సడలించాలని అంటున్నారు. కువైట్ పొరుగు దేశాలు కూడా ఈ విషయంలో త్వరతగతిన నిర్ణయం తీసుకొని వ్యాక్సిన్ పొందిన వారికి కొన్ని సడలింపులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ..కువైట్లో ఇప్పటికే 4,62,000 మంది వ్యాక్సిన్ తీసుకున్నారని..అయినా క్వారంటైన్ నిబంధనను కొనసాగించటంలో అర్ధం లేదన్నది పార్లమెంటేరియన్ల వాదన. వ్యాక్సిన్ తీసుకున్న వారిని కూడా క్వారంటైన్ నిబంధన పరిధిలోకి తీసుకురాటం ద్వారా వ్యాక్సినేషన్ వల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీంతో పార్లమెంటేరియన్ల డిమాండ్ ను పరిగణలోకి తీసుకున్న కువైట్ వ్యాక్సిన్ తీసుకున్న వారిని క్వారంటైన్ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇదిలాఉంటే కువైట్ మంత్రివర్గ నిర్ణయం ఎలా ఉన్నా..అందుకు తగినట్లుగా సిద్ధంగా ఉండేందుకు మోసాఫెర్ యాప్ లో వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com