కోవిడ్ కేసుల కారణంగా సౌదీలో మరో ఏడు మసీదుల మూసివేత
- March 21, 2021
సౌదీ:కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సౌదీ ప్రభుత్వం..కోవిడ్ కేసులు నమోదవుతున్న మసీదులపై కూడా ఫోకస్ చేసింది. కింగ్డమ్ పరిధిలోని 7 మసీదుల్లో భక్తులకు పాజిటివ్ రావటంతో ఇస్లామిక్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ఆ ఏడు మసీదులను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. మూసివేసిన మసీదుల్లో మూడు రియాద్‌లో ఉన్నాయని వెల్లడించింది. అలాగే తూర్పు ప్రావిన్స్, ఉత్తర సరిహద్దులు, నజ్రాన్, ఆసిర్లలో ఒక్కో మసీదు ఉన్నాయని మంత్రిత్వ శాఖ వివరించింది. ఇదిలాఉంటే..వైరస్ కేసులు నమోదవుతుండటంతో గత 41 రోజులలో 326 మసీదులను తాత్కాలికంగా మూసివేసిన విషయం తెలిసిందే. శానిటైజ్ చేసిన తర్వాత 311 మసీదుల్లో ప్రార్థనలు ప్రారంభించారు.
--జయ(మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ అరేబియా)
తాజా వార్తలు
- 16వ ఆర్థిక సంఘం నివేదిక పై లోక్‌సభలో ఎంపీ బాలాశౌరి ప్రశ్న
- అగ్నివీర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..
- వెబ్ సమ్మిట్: టెక్ స్టార్టప్‌లకు $2 బిలియన్ల ప్రోత్సాహం..!!
- సౌదీలో 127 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- యూఏఈలో గోల్డ్, సిల్వర్ అమ్ముతున్న నివాసితులు..!!
- వాణిజ్య శాఖ పరిధిలోకి ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు..!!
- ముసందమ్లో తొమ్మిది మంది ఆసియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్ ఫిబ్రవరి ఇంధన ధరలు ఇవే..!!
- ఉక్రెయిన్‌లో శాంతి చర్చల ముందు రష్యా డ్రోన్ దాడి..15 మంది మృతి
- 30వేల మందికి లేఆఫ్స్ ఇవ్వనున్న ఒరాకిల్







