కోవిడ్ కేసుల కారణంగా సౌదీలో మరో ఏడు మసీదుల మూసివేత

- March 21, 2021 , by Maagulf
కోవిడ్ కేసుల కారణంగా సౌదీలో మరో ఏడు మసీదుల మూసివేత

సౌదీ:కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సౌదీ ప్రభుత్వం..కోవిడ్ కేసులు నమోదవుతున్న మసీదులపై కూడా ఫోకస్ చేసింది. కింగ్డమ్ పరిధిలోని 7 మసీదుల్లో భక్తులకు పాజిటివ్ రావటంతో ఇస్లామిక్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ఆ ఏడు మసీదులను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. మూసివేసిన మసీదుల్లో మూడు రియాద్‌లో ఉన్నాయని వెల్లడించింది. అలాగే తూర్పు ప్రావిన్స్, ఉత్తర సరిహద్దులు, నజ్రాన్, ఆసిర్‌లలో ఒక్కో మసీదు ఉన్నాయని మంత్రిత్వ శాఖ వివరించింది. ఇదిలాఉంటే..వైరస్ కేసులు నమోదవుతుండటంతో గత 41 రోజులలో 326 మసీదులను తాత్కాలికంగా మూసివేసిన విషయం తెలిసిందే. శానిటైజ్ చేసిన తర్వాత 311 మసీదుల్లో ప్రార్థనలు ప్రారంభించారు. 

--జయ(మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ అరేబియా)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com