దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్: 1 మిలియన్ డాలర్లను పంచుకోనున్న 25 మంది కార్మికులు
- March 22, 2021దుబాయ్:అల్ ఖోజ్లోని ఓ స్కూల్ రవాణా సర్వీసు కంపెనీ సంయుక్తంగా 1 మిలియన్ డాలర్లను దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం డ్రాలో గెలుచుకుంది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ టెన్నిస్ ఛాంపియన్షిప్ పురుషుల ఫైనల్ మ్యాచ్ అనంతరం ఈ డ్రా జరిగింది. రష్యా టెన్నిస్ ప్లేయర్ అలాగే టోర్నమెంట్ ఛాంపియన్ అయిన అస్లాన్ కరాట్సేవ్ ఈ డ్రా తీశారు. అతనికి ఇదే తొలి దుబాయ్ టైటిల్. కాగా, విన్నింగ్ టికెట్ 34 ఏళ్ళ భారత జాతీయుడు రాహుల్ కోవితాల తజెవెట్టిల్ పేరుతో వుంది. 12 ఏళ్ళుగా రాహుల్ సీనియర్ ఫైనాన్స్ అధికారిగా ట్రాన్స్పోర్ట్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆయన, ఆయన సహచరులు గత నాలుగేళ్ళుగా ఈ ప్రమోషన్లో భాగమవుతూ వస్తున్నారు. కేరళకు చెందిన రాహుల్, ఈ బహుమతి గెలుచుకున్న 178వ భారతీయుడిగా రికార్డులకెక్కారు. 1999లో మొదలైన ఈ ర్యాఫిల్ లో ఇప్పటిదాకా విజయం సాధించినవారిలో అత్యధికులు భారతీయులే.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు