67వ జాతీయ అవార్డుల ప్రకటన
- March 22, 2021
న్యూ ఢిల్లీ:కరోనా వైరస్ కారణంగా సంవత్సరం పాటూ ఆలస్యమైన 67వ జాతీయ అవార్డుల ప్రకటన ఎట్టకేలకు ఈ రోజు జరిగింది. ఇక 2019 సంవత్సరానికి గాను మొత్తం 461 చిత్రాలు ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరిలో పోటీ పడగా... 220 సినిమాలు నాన్ ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీలో అవార్డుల కోసం ప్రయత్నించాయి. ఇక ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్స్ గా 13 రాష్ట్రాలు బరిలో దిగగా సిక్కిం జాతీయ పురస్కారం దక్కించుకుంది.
సెలబ్రిటీల విషయానికి వస్తే కంగనా రనౌత్ మరోసారి జాతీయ అవార్డుల బరిలో సత్తా చాటింది. ఆమె నటించిన ‘మణికర్ణిక, పంగా’ సినిమాలకిగానూ ఉత్తమ నటిగా ఎంపికైంది. మరోవైపు, ఉత్తమ నటులుగా తమిళ హీరో ధనుష్, బాలీవుడ్ యాక్టర్ మనోజ్ బాజ్ పాయ్ నిలిచారు. ‘అసురన్’ చిత్రానికిగానూ ధనుష్ ని పురస్కారం వరించగా ‘భోంస్లే’ సినిమాలో నటనకి మనోజ్ బాజ్ పాయ్ మెడల్ అందుకోనున్నారు.
‘బహత్తర్ హురైన్’ సినిమా డైరెక్టర్ సంజయ్ పూరన్ సింగ్ ఉత్తమ దర్శకుడిగా నిలిచాడు. కాగా ఉత్తమ సహాయ నటిగా ‘ది తాష్కెంట్ ఫైల్స్’ యాక్ట్రస్ పల్లవి జోషీ ఎంపికైంది. కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతికి ‘సూపర్ డీలక్స్’ మూవీలో నటనకు ఉత్తమ సహాయ నటుడు పురస్కారం దక్కింది. దివంగత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన ‘చిచోరే’ ఉత్తమ హిందీ చిత్రంగా నేషనల్ అవార్డ్ కైవసం చేసుకుంది. ‘మరక్కర్’ మలయాళ సినిమా జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఘనతను సాధించింది. ఇదే చిత్రానికి బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డ్ కూడా లభించింది.
మన తెలుగు సినిమా రంగం విషయానికి వస్తే నాని నటించిన గౌతమ్ తిన్ననూరి మూవీ ‘జెర్సీ’ ఉత్తమ చిత్రంగా నిలిచింది.‘జెర్సీ’ సినిమాకే బెస్ట్ ఎడిటింగ్ అవార్డ్ కూడా లభించటం విశేషం. కాగా మహేశ్ బాబు ‘మహర్షి’ సినిమా ఉత్తమ వినోదాత్మక చిత్రం పురస్కారంతో పాటూ ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డ్ పొందింది.రాజు సుందరం మెడల్ స్వీకరించనున్నాడు. ఇక ఉత్తమ చిత్రం 'మహర్షి' హోల్ సమ్ ఎంటర్టైన్మెంట్ గా ఎంపిక కావటం గమనార్హం.
67వ జాతీయ చలన చిత్ర అవార్డుల వివరాలు
- ఉత్తమ నటుడు: ధనుష్(అసురన్), మనోజ్ బాజ్పాయ్(భోంస్లే)
- ఉత్తమ నటి: కంగనా రనౌత్(మణికర్ణిక/పంగా)
- ఉత్తమ దర్శకుడు: బహత్తార్ హూరైన్
- ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి(ది తాష్కెంట్ ఫైల్స్)
- ఉత్తమ సహాయ నటుడు: విజయ్ సేతుపతి(సూపర్ డీలక్స్)
- ఉత్తమ చిత్రం(హిందీ): చిచ్చోరే
- ఉత్తమ చిత్రం(తెలుగు): జెర్సీ
- ఉత్తమ చిత్రం(తమిళం): అసురన్
- ఉత్తమ కొరియోగ్రాఫర్: రాజు సుందరం(మహర్షి)
- ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ: అవనే శ్రీమన్నారాయణ(కన్నడ)
- ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: మరక్కర్ అరబ్(మలయాళం)
- ఉత్తమ సంగీత దర్శకుడు: జ్యేష్టపుత్రో
- ఉత్తమ మేకప్: హెలెన్
- ఉత్తమ గాయకుడు: కేసరి (తేరీ మిట్టీ)
- ఉత్తమ గాయని: బర్దో(మరాఠీ)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?