మహాత్మా గాంధీ ఐస్ విగ్రహం...కెనడాలో అద్భుతం
- March 22, 2021
కెనడాలోని ఓ ప్రముఖ హోటల్ వద్ద భారత జాతిపిత గాంధీజీ ఐస్ విగ్రహం ఏర్పాటైంది. రానున్న ఆగస్టు 15 న ఇండియా 75 వ స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకోనుంది. దీన్ని పురస్కరించుకుని క్యూబెక్ సిటీలోని ఈ హోటల్ ఆవరణలో ఏడు అడుగుల ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని నెలకొల్పారు. ఇది పూర్తిగా ఐస్ తో తయారవడం విశేషం. మార్క్ లీ పెయిర్ అనే ఐస్ ఆర్టిస్టు ఈ విగ్రహాన్ని రూపొందించాడు. టొరంటో లోని భారత దౌత్య కార్యాలయం ఈ విగ్రహ ఇమేజీని తమ అధికారిక ట్విటర్ లో షేర్ చేస్తూ లాంచింగ్ ఆజాదీకా అమృత్ మహోత్సవ్ అంటూ పేర్కొంది. ఈ సందర్భంగా ఈ విగ్రహావిష్కరణ గురించి వివరించింది. 75 ఏళ్ళ భారత స్వాతంత్య్ర ఉత్సవాల నేపథ్యంలో ప్రధాని మోదీ మార్చి 12 న ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ని లాంచ్ చేశారు. ఇప్పుడు కెనడా మన ఇండియాతో బాటు గాంధీజీకి గౌరవ పురస్కరంగా ఈ విగ్రహాన్ని ఈ హోటల్ వద్ద ఏర్పాటు చేసినట్టు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు