మహర్షి, జెర్సీ చిత్ర బృందాలకు ఏపీ గవర్నర్ అభినందన

- March 23, 2021 , by Maagulf
మహర్షి, జెర్సీ చిత్ర బృందాలకు ఏపీ గవర్నర్ అభినందన

విజయవాడ: జాతీయ స్దాయి అవార్డులు సాధించిన తెలుగు చలనచిత్ర పరిశ్రమను, అయా చిత్ర బృందాలను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అభినందించారు. జాతీయ పురస్కారాల్లో తెలుగు సినిమా తన ప్రత్యేకతను నిలుపుకోగా,  2019 సంవత్సరానికి గానూ నాలుగు పురస్కారాలను సొంతం చేసుకుంది. కేవలం కధలే కాకుండా సాంకేతికంగా కూడా తెలుగు సినిమా పురోగతిని సాధించటానికి నిదర్శంగా అవార్డులు పొందగలగటం శుభపరిణామని గవర్నర్ అన్నారు.  ఉత్తమ ప్రజాదరణ పొందిన వినోదాత్మక చిత్రంగా ‘మహర్షి’, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘జెర్సీ’ జాతీయ పురస్కారాల్ని సొంతం చేసుకోవటం పట్ల బిశ్వభూషణ్ సంతోషం వ్యక్తం చేసారు. ఉత్తమ నృత్య దర్శకత్వం (మహర్షి), ఉత్తమ ఎడిటింగ్‌ (జెర్సీ) విభాగాల్లో జాతీయ పురస్కారాలు దక్కటం తెలుగు సినిమా గొప్పతనాన్ని వెల్లడిస్తుందని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్  పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com