తెలంగాణలో రేపట్నుంచి స్కూల్స్ బంద్… కేసీఆర్ కీలక ప్రకటన
- March 23, 2021
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో బుధవారం నుంచి విద్యాసంస్థలు తాత్కాలికంగా బంద్ చేస్తున్నట్లు వెల్లడించింది. వైద్య కళాశాలలు మినహాయించి.. రాష్ట్రంలోని అన్ని గురుకుల విద్యాలయాలు, హాస్టల్స్ కూడా మూసివేయనున్నారు. ఈ మేరకు అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ప్రకటన చేశారు. అయితే ఆన్‌లైన్ క్లాసులు యథాతథంగా జరగనున్నాయి. విద్యాసంస్థలు కరోనా విస్పోటన కేంద్రాలుగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నట్లు చెప్పింది. దేశంలోని చాలా రాష్ట్రాలు ఇప్పటికే ఈ తరహా నిర్ణయాలు తీసుకున్నాయని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి చెప్పారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని మంత్రి కోరారు.
రాష్ట్రంలో కరోనా వైరస్ మరోసారి కోరలుచాస్తోంది. ముఖ్యంగా స్కూల్స్, గురుకులాల్లో కరోనా వైరస్ విజృంభిస్తుంది. ఇప్పటికే 700 మంది విద్యార్థులకు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వైద్యా ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా 10వ తరగతి లోపు పాఠశాలలను, గురుకులాలను, వసతిగృహాలను వెంటనే మూసివేస్తే మంచిందని సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదనపై రివ్యూ చేసిన సీఎం కేసీఆర్.. స్కూల్స్ తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి అసెంబ్లీలో ప్రకటన చేశారు.
తాజా వార్తలు
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
- కేరళలో ఘనంగా మొదలైన పూరం సంబరాలు
- యూఏఈ సంచలన నిర్ణయం..50% సేవలు AIతోనే
- ఓడించే పార్టీ విజయ్ టీవీకే!
- ET బిజినెస్ రిఫార్మర్ అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు
- యూపి ట్రిపిల్ మర్డర్: కేక్ పూయడం పై గొడవ..ముగ్గురు స్నేహితుల కాల్చివేత!
- సోషల్ మీడియాలో ఫేక్ వీసా,ఆఫర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- వైట్‌హౌస్ డిన్నర్ వద్ద కాల్పులు..షూటర్ ఫోటో విడుదల
- ట్రంప్ డిన్నర్ టైంలో కాల్పులు..పరుగులు పెట్టిన సెక్యూరిటీ









