మూడేళ్ల కాంట్రాక్ట్ ప్రతిపాదికన ప్రభుత్వ ఉన్నతాధికారులకు విధులు

- March 24, 2021 , by Maagulf
మూడేళ్ల కాంట్రాక్ట్ ప్రతిపాదికన ప్రభుత్వ ఉన్నతాధికారులకు విధులు

దుబాయ్:మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు పని విధాలను మరింత మెరుగుపర్చుకోవటం..ప్రభుత్వ శాఖలన్ని మరింత సరళతరంగా ప్రజలకు సేవలను అందించటమే లక్ష్యంగా దుబాయ్ పాలనా యంత్రాంగం తమ విభాగాలను పునర్నిర్మించుకుంటోంది. ఇందులో భాగంగా అన్ని ప్రభుత్వ విభాగాల్లోని ఉన్నతాధికారులు, డైరెక్టర్లకు మూడేళ్ల కాంట్రాక్ట్ ప్రతిపాదికన విధులను అప్పగిస్తోంది. ఈ కాంట్రాక్ట్ కాలంలో ఉన్నతాధికారుల సమర్ధతను, విధుల నిర్వహణను బేరీజు వేసుకొని అందుకు తగినట్లుగా ప్రొత్సహాకాలను ఇవ్వనుంది. ప్రభుత్వ విభాగాల్లో జవాబుదారీతనం, సమర్ధనీయత, సరళతర సేవల కోసమే ఈ మార్పులు చేపట్టినట్లు దుబాయ్ పాలకుడు హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ వెల్లడించారు. జీవిత గమనంలో గత విజయాలను మాత్రమే నెమరేసుకుంటూ ఉండేవారికి భవిష్యత్తు ఉండదని, అలాంటి వారి భవిష్యత్తు తిరోగమనంలో ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉజ్వల భవిష్యత్తు ఆకాంక్షలతో దుబాయ్ అడుగులు వేస్తోందని, అదే సంకల్పంతో ముందుకు పయనిస్తామని, ఆ తర్వాత మంచి ఫలితాలు మన కళ్ల ముందు కనిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com