కర్ఫ్యూ టైంలో నడకకు మాత్రమే అనుమతి..వాహనాలకు నో పర్మిషన్

- March 24, 2021 , by Maagulf
కర్ఫ్యూ టైంలో నడకకు మాత్రమే అనుమతి..వాహనాలకు నో పర్మిషన్

కువైట్:కోవిడ్ వ్యాప్తి నియంత్రణ కోసం పాక్షిక కర్ఫ్యూ విధిస్తూ కువైట్ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలను తూచ తప్పకుండా అమలు చేస్తామని పరిపాలనా, భద్రత వ్యవహారాల డైరెక్టర్ జనరల్ పేర్కొన్నారు. గతంలో సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండగా..మంత్రివర్గం తీసుకున్న కొత్త నిర్ణయం మేరకు కర్ఫ్యూ సమయంలో ఓ గంట తగ్గింది. అంటే సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుందని ఆయన అన్నారు. అయితే..కర్ఫ్యూ సమయంలో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నివాస ప్రాంతంలో వాకింగ్ కు వెళ్లవచ్చని స్పష్టం చేశారు. వాకింగ్ కు వెళ్లేవారు ఖచ్చితంగా భౌతిక దూరం పాటించాలని, ఫేస్ మాస్క్ పెట్టుకోవాలన్నారు. లేదంటే కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కింద చట్టారిత్యా చర్యలు తీసుకుంమని ఆయన హెచ్చరించారు. అయితే..కర్ఫ్యూ సమయంలో కేవలం వాకింగ్ కు మాత్రమే వెసులుబాటు ఉందన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని, ఎలాంటి వాహనాలకు అనుమతి లేదని ఆయన అన్నారు. వాకింగ్ కు కేటాయించిన సమయంలో ఎవరైనా వాహనాలతో బయటికి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com