‘సుల్తాన్’ ట్రైలర్
- March 24, 2021చెన్నై:తమిళ స్టార్ నటుడు కార్తీ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ ‘సుల్తాన్’. రష్మిక మందాన హీరోయిన్గా నటిస్తుంది. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై యస్.ఆర్.ప్రకాశ్‌బాబు, యస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి స్పందన లభించింది. ఈ క్రమంలో తాజాగా 'సుల్తాన్' ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. సుల్తాన్ లో కార్తీ, రష్మిక మధ్య ప్రేమ సన్నివేశాలు కూడా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. కాగా కార్తీ యాక్షన్, రొమాంటిక్ తో ట్రైలర్ రొటీన్ గా సాగింది. వినడానికి.. చూడటానికి కొత్తగా అనిపించలేదు. ‘వందమంది రౌడీలను మేనేజ్ చేస్తున్నాను.. ఇది చూపులతోనే చంపేస్తుంది..’ అంటూ కార్తీ చెప్పే డైలాగులు బాగున్నాయి. ఏప్రిల్ 2న సుల్తాన్ థియేటర్లలోకి రానుంది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..