'ట్రిపుల్ ఆర్' చెర్రీ పోస్టర్ విడుదల

\'ట్రిపుల్ ఆర్\' చెర్రీ పోస్టర్ విడుదల

హైదరాబాద్:దర్శక ధీరుడు రాజమౌళి మరోసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానుల మనసుల్ని దోచుకున్నాడు. వాళ్ళ అభిమాన హీరో రామ్ చరణ్ పుట్టిన రోజుకు కాస్తంత ముందుగానే 'ట్రిపుల్ ఆర్'లో అతను పోషిస్తున్న రామరాజు పాత్రకు సంబంధించిన కలర్ ఫుల్ పోస్టర్ ను విడుదల చేశాడు. విశేషం ఏమంటే... విల్లంబును ఎక్కు పెట్టిన రామరాజుగా రామ్ చరణ్ సూపర్ గా ఉన్నాడు. ఈ పోస్టర్ ను ట్వీట్ చేస్తూ, 'ధైర్యం, గౌరవం, సమగ్రత... కలిగిన మా సీతారామరాజును మీకు పరిచయం చేస్తున్నాను అంటూ రాజమౌళి ట్వీట్ చేశాడు. గొప్ప లక్షణాలు ఉన్న సోదరుడు ఇతనంటూ ఎన్టీయార్ సైతం అదే పోస్టర్ ను ట్వీట్ చేశాడు.  అల్లూరి సీతారామరాజు  పాత్ర పోషించడం నా అదృష్టం' అంటూ రామ్ చరణ్ సైతం ఆ పోస్టర్ ను పోస్ట్ చేసి పేర్కొన్నాడు. ఇక ఈ చిత్రంతో అనుబంధం ఉన్న పలువురు ప్రముఖులు ఈ పోస్టర్ ను రీ ట్వీట్ చేస్తున్నారు. సాయంత్రం 4 గంటల నుండి 'ట్రిపుల్ ఆర్'లోని రామరాజు పోస్టర్ సోషల్ మీడియాలో హల్చల్ సృష్టించడం మొదలెట్టింది. మరి తొలి గంటలోనూ, ఆ తర్వాత 24 గంటల్లోనూ ఈ పోస్టర్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Back to Top