భారీగా బంగారం బిస్కెట్లు పట్టివేత...
- March 26, 2021
ఏ.పీ: కర్నూలు జిల్లాలో 6 కోట్ల 86 లక్షల విలువైన బంగారం పట్టుబడింది. ఆర్టీసీ బస్సులో తరలిస్తుండగా 14 కిలోల 800 గ్రాముల బంగారు బిస్కెట్లను సీజ్ చేశారు పోలీసులు. ఈ ఘటన పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద చోటుచేసుకుంది. తెలంగాణ నుంచి కర్నూలు వైపు ఆర్టీసీ బస్సు వస్తుండగా సెబ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.రాజు అనే ప్రయాణికుడి సంచిలో బంగారు బిస్కెట్లు గుర్తించారు.అతను అనంతపురం జిల్లా తాడిపత్రిలోని రాయలసీమ బులియన్ కమ్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే నగల దుకాణంలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. యజమాని ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని ఓ బంగారం దుకాణం నుంచి బంగారు బిస్కెట్లు తెస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ బంగారానికి ఎలాంటి బిల్లులు లేకపోవడంతో కేసు నమోదు చేశామన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







