సా.6 గంటల వరకే బస్సు సర్వీసులు..ఎమ్వసలాత్ క్లారిటీ
- March 26, 2021
ఒమన్ : కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు నైట్ లాక్డౌన్ విధించనున్నట్లు ఒమన్ సుప్రీం కమిటీ ప్రకటించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా తమ బస్సు, ఫెర్రీస్ సర్వీసుల సమయాలను కూడా కుదిస్తున్నట్లు ఎమ్వసలాత్ స్పష్టం చేసింది. మార్చి 28 నుంచి ఏప్రిల్ 8 వరకు సాయంత్రం 6 గంటల వరకు తమ సర్వీసులు గమ్యస్థానాలకు చేరుకుంటాయని వెల్లడించింది. అందుకు అనుగుణంగా ఇంటర్ సిటీ బస్సు సర్వీసు సమయాలను రీషెడ్యూల్ చేస్తామని వివరించింది. సిటీ బస్సులు మస్కట్, సలాలాలో సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. రీషెడ్యూల్ చేసిన బస్సు, ఫెర్రీస్ సర్వీసుల సమయాలను పూర్తి వివరాలతో సోషల్ మీడియాలోని తమ అధికారిక ఖాతాల ద్వారా తెలియజేస్తామని ఎమ్వసలాత్ ప్రకటించింది.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







