పర్యాటకులను ఆకర్షించేందుకు అబుధాబి పర్యాటక శాఖ ఆఫర్లు

- March 27, 2021 , by Maagulf
పర్యాటకులను ఆకర్షించేందుకు అబుధాబి పర్యాటక శాఖ ఆఫర్లు

అబుధాబి:స్థానికులు, సందర్శకులను పర్యాటకంవైు ఆకర్షించేందుకు అబుధాబి కల్చర్ అండ్ టూరిజం డిపార్ట్మెంట్ ఆఫర్ల వర్షం కురిపించింది. అన్ని ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ అతిథులకు సురక్షిత బస ఏర్పాట్లను చేయటంలో అబుధాబి హోటల్స్ ప్రమాణికతను చాటిచెప్పటమే ఈ క్యాంపేన్ లక్ష్యం. అబుధాబి పర్యాటక శాఖ వెల్లడించిన వివరాల మేరకు ఎమిరాతిలోని దాదాపు 50 హోటల్స్ ఎఫ్&బి ఔట్ లెట్స్ లలో బ్రేక్ ఫాస్ట్, లంచ్ లేదా డిన్నర్ ఏర్పాట్లతో బసకు సంబంధించి సగం ధరకే బోర్డింగ్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. పర్యాటక శాఖ లిస్ట్ లో ఉన్న 50 హోటల్స్ లో రెండు రాత్రులు గదులను బుక్ చేసుకుంటే మరో గదిని సగం ధరకే బుక్ చేసుకోవచ్చు. అలాగే 16 ఏళ్లలోపు వారికి పూర్తిగా ఉచితంగా హోటల్స్ ఉండే సౌలభ్యం కల్పించారు. ఏప్రిల్ 20 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. మరపురాని అనుభవాలను ఆస్వాదించడానికి అబుధాబి వైవిధ్య జీవన గమనంలో భాగస్వామ్యులు అయ్యేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పర్యాటక శాఖ డైరెక్టరేట్ పర్యాటకులకు ఆహ్వానం పలుకుతోంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com