రెంట్ కంట్రాక్ట్, ప్రభుత్వ స్టాంపుల ఫేకింగ్: వ్యక్తిపై విచారణ

- March 27, 2021 , by Maagulf
రెంట్ కంట్రాక్ట్, ప్రభుత్వ స్టాంపుల ఫేకింగ్: వ్యక్తిపై విచారణ

యూఏఈ: అరబ్ వ్యక్తి ఒకర్ని రెంట్ కాంట్రాక్టుని ఫేక్ చేసినందుకు అలాగే అధికారిక స్టాంపుల్ని ఫేక్ చేసినందుకుగాను అరెస్ట్ చేయడం జరిగింది. దుబాయ్ లో ఈ ఘటన జరిగింది. 2019 నవంబర్ 13న ఈ ఘటన జరిగింది. షార్జా ప్రభుత్వ అనుమతి పొందినట్లుగా నిందితుడు ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేశాడు. వాటర్ మరియు ఎలక్ట్రిసిటీ బిల్లుని కూడా నిందితుడు ఫేక్ చేయడం జరిగింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు ఫారినర్స్ ఎపైర్స్ వద్దకు వెళ్ళి రెసిడెన్సీ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కాగా, ఉద్యోగి మరిన్ని వివరాలు అకామడేషన్ విషయమై అడిగారు. ఈ కేసులో సాక్షి అయిన ఉద్యోగి, నిందితుడు అసహనంతో ఆందోళనతో కనిపించడాన్ని గుర్తించారు. ఈ క్రమంలోనే డాక్యుమెంట్లలోని వివరాలపై అనుమానం వచ్చింది ఉద్యోగికి. దాంతో నిందితుడు తన నేరాన్ని అంగీకరించగా, వెంటనే ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు ఉద్యోగి. నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com