ఉచిత క్వారంటైన్ ప్యాకేజీ...యూఏఈ ఎయిర్లైన్స్ బంపర్ ఆఫర్
- March 27, 2021
యూఏఈ:హాలిడే ట్రిప్ కోసం ప్లాన్ చేసుకుంటున్న యూఏఈ పౌరులు, నివాసితులకు ఆ దేశ విమానయాన సంస్థలు శుభవార్త తెచ్చాయి.క్వారెంటైన్ నిబంధనలు లేని దేశాలకు వెళ్లేందుకు హాలిడే ప్యాకేజీలను ప్రకటించాయి.వివరాల్లోకి వెళితే..కరోనా నేపథ్యంలో అమలులోకి వచ్చిన ఆంక్షల మూలంగా చాలా మంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.ఇదే సమయంలో చాలా దేశాలు ఆర్థికంగా నష్టపోయాయి.ఈ క్రమంలో కొన్ని దేశాలు ఆర్థిక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా చేసుకున్నాయి.ఇందులో భాగంగా కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్‌తో తమ దేశంలోకి అడుగుపెట్టే విదేశీ పర్యాటకులకు క్వారెంటైన్ నిబంధనలు వర్తింప చేయమని ప్రకటించాయి.
ఈ జాబితాలో టిబిలిసి, కైవ్,ఇస్తాంబుల్, తాష్కెంట్ సీషెల్స్,మాల్దీవులు,యెరెవాన్ మరియు నైరోబి కూడా ఉన్నాయి.ఈ క్రమంలో యూఏఈకి చెందిన విమానయాన సంస్థలు.. ఆయా దేశాలకు హాలిడే ప్యాకేజీలను రూపొందించాయి.ఈ ప్యాకేజీలు 1,029 దిర్హామ్‌ల నుంచి మొదలుకొని అత్యధికంగా 3,449 దిర్హామ్‌ల వరకూ ఉన్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. ఎయిర్ అరేబియా, ఇతిహాద్ ఎయిర్‌వేస్ వంటి సంస్థలు ఈ హాలిడే ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చాయి. కాగా.. మార్చి 31 వరకు మాత్రమే ఈ ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయని ఇతిహాద్ ఎయిర్‌వేస్ తెలిపింది.ఈ ప్యాకేజీలను సద్వినియోగం చేసుకోవాలని విమానయాన సంస్థలు కోరుతున్నాయి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







