కాల్పుల్లో 114 మంది ప్రజలు మృతి...
- March 28, 2021
మయన్మార్:మయన్మార్ లో ప్రస్తుతం సైనిక పాలన కొనసాగుతోంది. ఫిబ్రవరి 1 వ తేదీన మయన్మార్ లో ప్రజాస్వామ్యాన్ని కాలరాసి, జనరల్ మింగ్ అంగ్ లయాంగ్ సైనిక తిరుగుబాటు చేసి అధికారం హస్తగతం చేసుకున్నాడు. అప్పటి నుంచి దేశంలో ప్రజలు సైనిక పాలనకు నిరసిస్తూ తిరిగి దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేస్తున్నారు. ఆందోళనలు చేస్తున్న ఉద్యమకారులపై సైన్యం అణివేత చర్యలు చేపడుతోంది. శనివారం రోజున నిరసనలు చేస్తున్న నిరసనకారులపై భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 114 మంది ప్రజలు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రపంచం మొత్తం షాక్ అయ్యింది. మయన్మార్ సైనికపాలనపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే, ఈ చర్య జరిగిన కొన్ని గంటలకు జనరల్ టీవీ లో ప్రసంగించారు. త్వరలోనే దేశంలో తిరిగి ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







