భారత్‌కు మరో 10 రాఫెల్ యుద్ధ విమానాలు
- March 28, 2021
న్యూ ఢిల్లీ:భారత అమ్ములపొదిలోకి మరో పది రాఫెల్ యుద్ధ విమానాలు చేరుకోనున్నాయి. దీంతో భారత వైమానిక దళంలోని యుద్ధ విమానాల సంఖ్య 21కు చేరుకోనుంది.ఇప్పటికే 11 విమానాలు..అంబాలలోని 17వ స్వ్కాడ్రన్‌లో చేరాయి.మరో రెండు,మూడు రోజుల్లో 3 రాఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుండి భారత్ రానున్నాయని తెలిపారు.వచ్చే నెలలో రెండవ విడతలో మరో 7-8 యుద్ధ విమానాలు ఇక్కడకు చేరుకుంటాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. వీటి రాకతో వైమానిక దళం మరింత బలోపేతం కానుందని అన్నారు.మొత్తం 36 రాఫెల్ యుద్ధ విమానాల కోసం భారత్ 2016లో ఫ్రెంచ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి విదితమే.కొన్ని విమానాలు గత ఏడాది జులై-ఆగస్టుకు భారత్‌కు చేరుకున్నాయి.వాటిని వైమానిక దళంలోకి ప్రవేశపెట్టారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







