ప్రయాణీకులు 3,000 దిర్హాముల వరకు విలువ చేసే బహుమతులు తీసుకురావొచ్చు
- March 29, 2021
యూఏఈ: యూఏఈలోకి వచ్చే ప్రయాణీకులు తమ వెంట 3,000 దిర్హాముల వరకు విలువైన బహుమతుల్ని తీసుకొచ్చేందుకు అవకాశం వుందని ఫెడరల్ కస్టమ్స్ అథారిటీ పేర్కొంది. యూఏఈకి వచ్చే ప్రయాణీకులు, యూఏఈ నుంచి వెళ్ళే ప్రయాణీకులు తప్పనిసరిగా జీసీసీ యూనిఫైడ్ కస్టమ్స్ చట్టాల్ని గౌరవించాలని అథారిటీస్ సూచిస్తున్నాయి. అరబిక్, ఇంగ్లీషు మరియు ఉర్దూ భాషల్లో ఈ మేరకు అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. మూవీ ప్రొజెక్షన్ డివైజ్లు, టీవీ మరియు రిసీవర్, డిజిటల్ కెమెరాలు, సీడీ ప్లేయర్లు, పోర్టబుల్ కంప్యూటర్లు అలాగే ప్రింటర్లు, వ్యక్తిగత వినియోగం నిమిత్తం తెచ్చుకునే మందులు వంటి వాటికి సంబంధించి నిబంధనల మేర అనుమతి వుంటుంది. ఎట్టి పరిస్థుతుల్లోనూ బహుమతుల విలువ 3,000 దిర్హాములు దాటకూడదు. సిగరెట్ల విషయానికొస్తే, 200 కంటే ఎక్కువ తీసుకురాకూడదు. 18 ఏళ్ళ లోపు వయసువారు పొగాకు ఉత్పత్తులు, మద్యం తీసుకురాకూడదు. నగదు విషయాన్ని ఖచ్చితంగా డిస్క్లోజ్ చేయాలి. విలువైన లోహాలు, రాళ్ళ విలువ 60,000 దిర్హాముల కంటే ఎక్కువ వుంటే ఆ వివరాల్ని పొందుపర్చాలి.
తాజా వార్తలు
- అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాను ఛేదించిన యూఏఈ, కువైట్..!!
- కువైట్ ఎంబసీలో నేషనల్, లిబరేషన్ డే సెలబ్రేషన్స్..!!
- GCC లో పనిచేసే బహ్రెయిన్లకు నిరుద్యోగ బీమా..!!
- ఖసాబ్ లో భూకంపం వివరాలు వెల్లడి..!!
- ఖతార్ లో రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్..!!
- గాజా సంక్షోభం .. గ్లోబల్ వైఫల్యం: సౌదీ FM
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం
- ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా









