వెనిజులా అధ్యక్షుడు ప్రకటించిన ఆఫర్..వ్యాక్సిన్లు ఇస్తే ఆయిల్ ఇస్తా
- March 29, 2021
కరోనా..ఈ చిన్న సూక్ష్మ క్రిమి ప్రపంచ దేశాల్ని అల్లాడిస్తోంది. మానవాళి నుదుటి మీద మృత్యు శాసనాన్ని రాస్తోంది ఈ మహమ్మారి. దీంతో చాలా దేశాలు వ్యాక్సిన్లనే నమ్ముకున్నాయ్. లేటెస్ట్ గా కరోనా వైరస్ కేసులతో అల్లాడుతున్న వెనిజులా ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మహమ్మారితో అల్లాడుతున్న తమ దేశానికి వ్యాక్సిన్లు ఇస్తే ఆయిల్ ఇస్తామని వెనెజులా ప్రకటించింది. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో (Nicolas maduro) ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు." వెనిజులా వద్ద భారీగా చమురు ఉంది. దాన్ని కొనేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు. అయితే, మా ఉత్పత్తిలో కొంత భాగాన్ని కరోనా వ్యాక్సిన్ ను పొందేందుకు వినియోగించాలనుకుంటున్నాం. టీకాలిచ్చే వారికి చమురు ఇస్తాం " అని మదురో ప్రకటించారు. అయితే, వెనిజువెలా చమురు ఎగుమతులపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో భారత్ వంటి దేశాలు అక్కడి నుంచి చమురు దిగుమతిని పూర్తిగా నిలిపివేశాయి. కొన్ని దశాబ్దాలుగా ఇతర దేశాలకు ఈ దేశ క్రూడాయిల్ ఎగుమతులు చాలావరకు తగ్గిపోయాయి. ఇప్పటి వరకు వెనిజువెలాలో రష్యా రూపొందించిన స్పుత్నిక్ టీకాతో పాటు చైనాలో అభివృద్ధి చేసిన మరో టీకా వినియోగానికి మాత్రమే అనుమతులు లభించాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ తన కోవాక్స్ మెకానిజం ద్వారా కరోనా వ్యాక్సిన్లను పేద దేశాలకు అందజేస్తోందని, ఈ నేపథ్యంలోనే తాము ఏ దేశమైనా టీకామందులను ఇవ్వజూపితే ఇందుకు బదులుగా ఆయిల్ ను ఇస్తామంటున్నామని వెనెజులా అధ్యక్షుడు మదురో పేర్కొన్నారు. ఆంక్షల కారణంగా తమ దేశం నిధుల కటకటను ఎదుర్కొంటోందన్నారు.
మరోవైపు వెనిజులా ప్రభుత్వం వైద్యారోగ్య సిబ్బందికి టీకాలివ్వడం ఫిబ్రవరిలో ప్రారంభమైంది. అయితే, ఇప్పటివరకు ఎంత మందికి ఇచ్చారన్నది మాత్రం ప్రకటించలేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. దేశంలో ఇప్పటి వరకు 1,50,000 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 1,500 మంది మృత్యువాతపడ్డారు. అయితే, ఈ గణాంకాలపై అక్కడి ప్రతిపక్షాలు, స్వచ్ఛంద సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కేసులు ఇంకా భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉందని వాదిస్తున్నాయి. పైగా ఇటీవలి కాలంలో కేసులు మరోసారి భారీ స్థాయిలో విజృంభిస్తున్నాయి. బ్రెజిల్ వేరియంట్ ప్రబలరూపంగా ఉన్నట్లు గుర్తించారు.
తాజా వార్తలు
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్‌లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్‌లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..
- 45 రోజుల పాటు దుబాయ్ ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్‌లో దాక్కున్న డ్రగ్స్ స్మగ్లర్ అరెస్ట్..!!
- దుబాయ్ 'ఇన్వైట్' పథకానికి భారీ స్పందన..48 గంటల్లో 10 వేలకుపైగా దరఖాస్తులు
- బార్డర్ ఎగ్జిట్ రూల్స్, ట్రాఫిక్ ఫైన్స్ పై కువైట్ క్లారిటీ..!!
- హర్మూజ్‌లో ఉద్రిక్తత..భారతీయ సిబ్బంది ఉన్న గ్యాస్ ట్యాంకర్ లక్ష్యంగా దాడి







