'మాస్ట్రో'గా నితిన్
- March 30, 2021
హైదరాబాద్:ఆయుష్మాన్ ఖురానా నటించిన హిందీ చిత్రం 'అంధాధూన్'ను తెలుగులో నితిన్ హీరోగా ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నికిత రెడ్డి పునర్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు పేరు ఖరారు చేశారు. మార్చి 30 నితిన్ పుట్టిన రోజు సందర్భంగా సరిగ్గా అర్థరాత్రి 12 గంటలకు దీనికి 'మాస్ట్రో' అని నామకరణం చేశారు. అంధుడైన వాద్య కళాకారుడిగా నితిన్ నటిస్తుండగా, అతని జోడీగా నభా నటేశ్, మరో కీలక పాత్రలో తమన్నా యాక్ట్ చేస్తున్నారు. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ స్వరాలు అందిస్తున్న 'మాస్ట్రో' లో ఇతర ప్రధాన పాత్రలను నరేష్, జిషుసేన్ గుప్తా, శ్రీముఖి, అనన్య, హర్షవర్ధన్, రచ్చ రవి, మంగ్లీ, శ్రీనివాస్ రెడ్డి పోషిస్తున్నారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్న ఈ మూవీకి జె. యువరాజ్ సినిమాటోగ్రాఫర్. జూన్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజా వార్తలు
- సిత్రాలోని ఐన్ అల్ రహా సిఫార్సుకు కౌన్సిల్ ఆమోదం..!!
- రాస్ అల్ హర్క్ ఫారెస్టులో ఫైర్.. ఏవియేషన్ సహకారం..!!
- 2025లో 574,000 మున్సిపల్ లైసెన్సులు జారీ..!!
- పొగమంచులో ప్రయాణం..డ్రైవర్లకు సేఫ్టీ గైడ్ లైన్స్..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..పొగమంచు, వర్షాలు..!!
- యూఏఈలో డీలర్ల వద్దకు BMW కార్ల ఓనర్లు క్యూ..!!
- కేంద్ర రోడ్డు నిధి కింద రోడ్డు మరమ్మత్తుల పై ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- పాన్ కార్డు నిబంధనల్లో మార్పులు..ఏప్రిల్ 1 నుంచి అమలు
- ఫిలడెల్ఫియాలో ఘనంగా NATS బాలల సంబరాలు
- నమీబియా పై భారత్ భారీ స్కోరు









