'మాస్ట్రో'గా నితిన్
- March 30, 2021హైదరాబాద్:ఆయుష్మాన్ ఖురానా నటించిన హిందీ చిత్రం 'అంధాధూన్'ను తెలుగులో నితిన్ హీరోగా ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నికిత రెడ్డి పునర్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు పేరు ఖరారు చేశారు. మార్చి 30 నితిన్ పుట్టిన రోజు సందర్భంగా సరిగ్గా అర్థరాత్రి 12 గంటలకు దీనికి 'మాస్ట్రో' అని నామకరణం చేశారు. అంధుడైన వాద్య కళాకారుడిగా నితిన్ నటిస్తుండగా, అతని జోడీగా నభా నటేశ్, మరో కీలక పాత్రలో తమన్నా యాక్ట్ చేస్తున్నారు. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ స్వరాలు అందిస్తున్న 'మాస్ట్రో' లో ఇతర ప్రధాన పాత్రలను నరేష్, జిషుసేన్ గుప్తా, శ్రీముఖి, అనన్య, హర్షవర్ధన్, రచ్చ రవి, మంగ్లీ, శ్రీనివాస్ రెడ్డి పోషిస్తున్నారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్న ఈ మూవీకి జె. యువరాజ్ సినిమాటోగ్రాఫర్. జూన్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ