రమదాన్: 25 శాతం ప్రభుత్వ సిబ్బందికి రిమోట్ విధానంలో విధులు
- March 30, 2021
సౌదీ:మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మరియు సోషల్ డెవలప్మెంట్ అహ్మద్ అల్ రాజి, రమదాన్ నేపథ్యంలో ప్రభుత్వ సిబ్బంది విధులకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు. పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో ఉపవాస దీక్షలు చేసే ఉద్యోగుల కోసం మొత్తం సిబ్బందిలో 25 శాతానికి మించకుండా రిమోట్ విధానం ద్వారా పనిచేసేందుకు వీలు కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.ఉద్యోగులు మూడు గ్రూపులుగా విభజించబడతారు. ప్రతి గ్రూపునకూ మధ్య గంట విరామం వుండేలా తమ విధుల్ని ఆయా సిబ్బంది నిర్వహిస్తారు. అటెండెన్స్ రిజిస్టర్ కోసం నిర్దేశించబడిన ఫింగర్ ప్రింటింగ్ విధానం సస్పెండ్ అవుతుంది. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పని సమయం వుంటుంది ఉద్యోగులకు. కరోనా వైరస్ నేపథ్యంలో విధిగా ముందు జాగ్రత్త చర్యలు పాటించాలి. కరోనా వైరస్ నేపథ్యంలో తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యేవారికి రిమోట్ వర్కింగ్ విధానంలో ప్రాధాన్యత కల్పిస్తారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..
- 45 రోజుల పాటు దుబాయ్ ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్‌లో దాక్కున్న డ్రగ్స్ స్మగ్లర్ అరెస్ట్..!!
- దుబాయ్ 'ఇన్వైట్' పథకానికి భారీ స్పందన..48 గంటల్లో 10 వేలకుపైగా దరఖాస్తులు
- బార్డర్ ఎగ్జిట్ రూల్స్, ట్రాఫిక్ ఫైన్స్ పై కువైట్ క్లారిటీ..!!
- హర్మూజ్‌లో ఉద్రిక్తత..భారతీయ సిబ్బంది ఉన్న గ్యాస్ ట్యాంకర్ లక్ష్యంగా దాడి
- బ్లాక్ సిలో నౌక పై దాడి..భారతీయుడు దుర్మరణం
- విద్యార్థుల కేసు విచారణపై స్పష్టత ఇచ్చిన సీజేఐ సూర్యకాంత్!
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక







