ఫేస్ మాస్క్ ఉల్లంఘనలు 63,842

- March 30, 2021 , by Maagulf
ఫేస్ మాస్క్ ఉల్లంఘనలు 63,842

బహ్రెయిన్: మార్చి 25 వరకు రికార్డు స్థాయిలో ఫేస్ మాస్క్ ఉల్లంఘలు నమోదయ్యాయి. ఇంటీరియర్ మినిస్ట్రీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్క్ ధరించాలని అథారిటీస్ సూచిస్తున్నాయి. పౌరులు, నివాసితులు ఫేస్ మాస్కు ధరించడం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. కరోనా బాధిత వ్యక్తి తుమ్మినా, దగ్గినా ఆరడుగుల దూరం వరకు వైరస్ విస్తరించే అవకాశం వుంటుంది. ఇతరుల ముక్కులు లేదా నోట్లోకి వైరస్ నేరుగా వెళ్ళేందుకు అవకాశాలెక్కువ. ఎక్కువగా లక్షణాలు లేని కరోనా బాధితుల నుంచే ఇతరులకు వేగంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్కు ధరించడం వల్ల తమను తాము రక్షించుకోవడంతోపాటు, ఇతరులకు కరోనా సోకకుండా చేయగలరని అధికారులు చెబుతున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com