ఏపీలో మళ్ళీ భారీగా పెరిగిన కరోనా కేసులు
- March 30, 2021
అమరావతి:ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.తాజా కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 993 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 900805కు చేరింది.ఇందులో 886978 మంది కోలుకొని డిశ్చార్జి కాగా 6614 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో ముగ్గురు మరణించారు.దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 7213కి చేరింది.గడిచిన 24 గంటల్లో ఏపీలో 480 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక భారత్ లో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదయ్యాయి.దేశంలో కొత్తగా 56,211 కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,20,95,855కి చేరింది.ఇందులో 1,13,93,021 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, 5,40,720 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.దేశంలో కొత్తగా 271 మంది కరోనాతో మృతి చెందారు.దీంతో ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,62,114కి చేరింది.ఇక ఇదిలా ఉంటే, భారత్ లో గడిచిన 24 గంటల్లో 37,028 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 6,11,13,354 మందికి కరోనా వ్యాక్సిన్ ను అందించారు.
తాజా వార్తలు
- యూఏఈలో ధరలు పెంచితే..Dh100,000 వరకు జరిమానా..!!
- వాహనం నడుపుతూ 44 ఏళ్ల వ్యక్తి మృతి..!!
- కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పనివేళల్లో మార్పులు..!!
- ఖతార్ అమిరి వైమానిక దళం విమానాల రికవరీ ఎక్సర్ సైజ్..!!
- సౌదీ అరేబియాలో ప్రిన్స్ విలియం..చారిత్రక ప్రదేశాల విజిట్..!!
- అరేబియా, ఒమన్ సముద్రంలో ఫిషరీస్ సర్వే..!!
- ICC T20 World Cup 2026: ఇంగ్లండ్ పై వెస్టిండీస్ విజయం
- నాలుగో అత్యంత విలువైన సంస్థగా SBI
- కెనడా స్కూల్లో కాల్పులు..10 మంది మృతి
- BHELలో 5 శాతం వాటాల విక్రయం..









