భారీగా బంగారం,కరెన్సీ పట్టివేత

- March 31, 2021 , by Maagulf
భారీగా బంగారం,కరెన్సీ పట్టివేత

హైదరాబాద్:హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ ఐదుగురు ప్రయాణికులు కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డారు. అందరు ప్రయాణికుల మాదిరిగానే వీరు కూడా దుబాయ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా మిక్సర్ గ్రైండర్‌లోని కటింగ్ మిషన్‌లో బంగారాన్ని అక్రమంగా తీసుకువచ్చారు. అయితే వీరిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా.. బంగారం తరలిస్తున్నట్లు గుర్తించారు. బంగారాన్ని మిక్సర్ గ్రైండర్ మోటార్లు, కట్టింగ్ ఉపకరణాలలో దాచడాన్ని గుర్తించారు. 2.5 కిలో బంగారాన్ని ఇలా రహస్యంగా తీసుకువచ్చారు. దీని విలువ రూ. 1.15 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు. సదరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు.. వారిని విచారిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com