ఫేక్ ఆటో పార్టులు: వ్యాపారవేత్తకు జరీమానా

- March 31, 2021 , by Maagulf
ఫేక్ ఆటో పార్టులు: వ్యాపారవేత్తకు జరీమానా

సౌదీ అరేబియా: సౌదీ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, యాంటీ కమర్షియల్ ఫ్రాడ్ చట్టాలను ఉల్లంఘించిన ‘ఆటో పార్టుల’ డీలర్ పట్ల తీవ్రంగా స్పందించింది. నార్త్ వెస్టర్న్ సౌదీ అరేబియాలోని హయిల్ ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త, సౌదీ చట్టాలకు లోబడి వ్యవహరించకుండా, ఫేక్ ఆటో పార్టుల్ని విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. నిందితుడికి 50,000 సౌదీ రియాల్స్ జరీమానా విధించడంతోపాటుగా, రెండు స్థానిక పేపర్లలో ఈ కేసుకి సంబంధించిన పూర్తి వివరాల్ని పొందుపరుస్తూ, నిందితుడి అనైతిక చర్యను బయటపెట్టడం జరిగింది. ఫేక్ ఆటో పార్టుల్ని స్వాధీనం చేసుకుని, ధ్వంసం చేయాల్సిందిగా న్యాయస్థానం సంబంధిత అధికారులను ఆదేశించింది. వినియోగదారులు ఇలాంటి వ్యవహారాల పట్ల సంబంధిత శాఖలకు ఫిర్యాదు చేయాలని న్యాయస్థానం సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com