తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- April 01, 2021
హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.తాజాగా తెలంగాణ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను విడుదల చేసింది.ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 887 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,08,776కి చేరింది.ఇందులో 3,01,564 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 5511 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక తెలంగాణలో కరోనాతో నలుగురు మృతి చెందారు.దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1701కి చేరింది.ఇక ఇదిలా ఉంటె, రాష్ట్రంలో కేసుల సంఖ్య సంఖ్య పెరుగుతుండటంతో ఆరోగ్యశాఖామంత్రి ఈటల రాజేందర్ ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు.రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమీక్షను నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ







