2.3 ట్రిలియన్ డాలర్ల మరో భారీ ప్యాకేజీ ప్రకటించిన బైడెన్
- April 01, 2021
వాషింగ్టన్: కరోనా మహమ్మారి అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఐదున్నర లక్షల మంది బలిగొన్న వైరస్.. అటు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను సైతం అస్తవ్యస్తం చేసేసింది. ఇక కొవిడ్-19తో తీవ్రంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్ధను గాడిలో పెట్టేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవలే 1.9 ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని తీసుకువచ్చారు. అది కూడా అధికారంలోకి వచ్చిన కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఈ భారీ ఉద్దీపన ప్యాకేజీని తీసుకొచ్చే ఉభయ సభల్లో గెలిపించుకోవడం విశేషం. తాజాగా బైడెన్ మరో భారీ ప్యాకేజీ ప్రకటించారు. ఈసారి మౌలిక సదుపాయాల రంగానికి ఊతమిచ్చేలా ఈ ఉద్దీపన ప్యాకేజీ తీసుకొస్తున్నట్లు బుధవారం వెల్లడించారు. వచ్చే ఎనిమిదేళ్లలో మౌలిక రంగ అభివృద్ధికి 2.3 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు.
దీనిని 'ఒక తరంలో ఒకసారి వెచ్చించే పెట్టుబడి'గా అధ్యక్షుడు పేర్కొన్నారు. అలాగే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దేశంలో అతి పెద్ద ఉద్యోగాల కల్పన పెట్టుబడి కూడా ఇదేనని బైడెన్ తెలిపారు. ఇక ఈ ఉద్దీపన ప్యాకేజీ ద్వారా సుమారు 621 బిలియన్ డాలర్లు రవాణా రంగం అభివృద్ధికి(వంతెనలు, రహదారులు, రోడ్ల పునరుద్ధరణ, విమానాశ్రయాల ఆధునీకరణ, విద్యుత్ వాహనాలకు) వినియోగిస్తామని ప్రకటించారు. అలాగే 400 బిలియన్ డాలర్లు వృద్ధులు, వికలాంగ అమెరికన్ల సంరక్షణకు కేటాయించారు. మరో 300 బిలియన్ డాలర్లు తాగునీటి మౌలిక సదుపాయాలు, బ్రాడ్‌బ్యాండ్ యాక్సెస్‌ను విస్తరించడం, ఎలక్ట్రిక్ గ్రిడ్లను అప్‌గ్రేడ్ చేయడలాంటి వాటికి ఉపయోగించనున్నట్లు తెలియజేశారు. కార్పొరేట్ పన్నును 21 శాతం నుంచి 28 శాతానికి పెంచనున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- నేటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు
- ఖతార్ లో వెయ్యి వస్తువుల ధరలు తగ్గింపు..!!
- మస్కట్ లో INSV కౌండిన్యకు ఘనంగా వీడ్కోలు..!!
- 2025లో సౌదీలో రెమిటెన్స్ రికార్డు..15శాతం వృద్ధి..!!
- ట్రాఫిక్ కు చెక్..అల్ ఖుద్రాలో కొత్త 4-లేన్ల బ్రిడ్జి ప్రారంభం..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం..తప్పిన పెనుప్రమాదం..!!
- ఫహాహీల్ ఎక్స్ ప్రెస్‌వే ఫాస్ట్ లేన్ 15 రోజుల పాటు మూసివేత..!!
- పోస్టాఫీస్‌లో అద్భుతమైన స్కీమ్..
- నోబెల్ గ్రహీత నర్గెస్‌కు మరో ఏడున్నరేళ్ల జైలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ









