శంషాబాద్‌ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత

- April 02, 2021 , by Maagulf
శంషాబాద్‌ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత

హైదరాబాద్:శంషాబాద్‌ విమానాశ్రయంలో శుక్రవారం అధికారులు విదేశీ కరెన్సీని పట్టుకున్నారు. రూ.8.40లక్షల విలువైన విదేశీ కరెన్సీని తీసుకెళ్తున్న ఓ వ్యక్తిని సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.G9451 విమానం ద్వారా షార్జా వెళ్లేందుకు యత్నించిన వ్యక్తి నుంచి కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది, కస్టమ్స్‌ అధికారులకు అప్పగించారు. అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com