ఇసా టౌన్, ముహరాక్ కేంద్రాల్లో పనివేళల పొడిగింపుపై ఎన్.పి.ఆర్.ఎ. ప్రకటన

- April 02, 2021 , by Maagulf
ఇసా టౌన్, ముహరాక్ కేంద్రాల్లో పనివేళల పొడిగింపుపై ఎన్.పి.ఆర్.ఎ. ప్రకటన

బహ్రెయిన్: నేషనాలిటీ పాస్-పోర్ట్స్ మరియు రెసిడెన్స్ ఎఫైర్స్ (NPRA), ఆదివారం.. అంటే ఏప్రిల్ 4 నుంచి ఇసా టౌన్ అలాగే ముహరాక్ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వీసా మరియు రెసిడెన్సీ డైరెక్టరేట్ అప్లికేషన్లను స్వీకరించడం జరుగుతుందని పేర్కొంది. ఇ-రెసిడెన్సీ పర్మిట్ జారీ ప్రక్రియ పూర్తి చేసుకున్నవారికి ఏ బ్రాంచ్ ద్వారా అయినా స్టిక్కర పొందవచ్చు. ముందస్తు అనుమతి లేకపోయినా, వ్యక్తిగతంగా హాజరై స్టిక్కర్ పొందడానికి వీలుంటుంది. ఇ-వీసా విధానం ద్వారా http://www.evisa.bh.as వెబ్ సైట్ నుంచి ఆయా సేవల్ని పొందవచ్చునని అథారిటీస్ పేర్కొంటున్నాయి. వర్కింగ్ అవర్స్ అనే లెక్క లేకుండా అన్ని వేళలా ఈ-సర్వీసులను వినియోగించుకోవచ్చు.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com