ఉద్యోగి భార్యకు వేతనం చెల్లించిన ఏరీస్ సంస్థ
- April 02, 2021
షార్జా: దీపా ప్రభిరాజ్ అనే ఓ మహిళ మార్చి 28న ఏరీస్ గ్రూప్ నుంచి వేతనం అందుకున్నారు. ఆమె ఆ సంస్థ కోసం ప్రత్యక్షంగా ఎలాంటి సేవలూ అందించలేదు. కానీ, ఆమె భర్త మాత్రం ఆ సంస్థలో పనిచేస్తున్నారు. ఆయన పేరు ప్రభిరాజ్ నటరాజన్. ఏరీస్ సంస్థలో మేనేజింగ్ డైరెక్టరుగా పనిచేస్తున్నారు. ఏరీస్ సంస్థలో పనిచేస్తున్నవారి భార్యల పేర్లను నెలవారీ వేతనాల లిస్టులో ఇటీవల చేర్చారు. ఈ విషయాన్ని ఈ మధ్యనే సంస్థ ఛైర్మన్ మరియు సీఈఓ సోహన్ రాయ్ వెల్లడించారు. పెళ్ళయ్యాక మూడేళ్ళపాటు కంపెనీతో పనిచేస్తున్నవారికి ఈ ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నారు. 25 శాతం వేతనాన్ని పొందుతారు ఈ కేటగిరీలో.చాలా కంపెనీలు ప్రస్తుత పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, తమ ఉద్యోగుల కస్టంతో తమ కంపెనీ స్థిరమైన ఎదుగుదల ప్రదర్శిస్తోందని సోహన్ రాయ్ వెల్లడించారు.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,షార్జా)
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







