రౌడీ షీటర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు...
- April 03, 2021
హైదరాబాద్:హైదరాబాద్ నగర శివారులోని మైలార్ దేవ్‌పల్లిలో సంచలనం సృష్టించిన రౌడీ షీటర్ అసద్ ఖాన్ హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు.ప్రధాన నిందితుడు యాసిన్ ఖాన్ సహా మొత్తం ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఓ మైనర్ బాలుడు కూడా ఉన్నట్లు శంషాబాద్ DCP ప్రకాష్ రెడ్డి తెలిపారు. నిందితులంతా హైదరాబాద్ పాతబస్తీలోని వట్టేపల్లి ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. 2018లో నిందితుడి తండ్రి అంజద్ ఖాన్‌ను.. అసద్ ఖాన్ అంతమెందించాడు. దానికి ప్రతీకారంగా యాసిన్ ఖాన్.. రౌడీ షీటర్ అసద్ ఖాన్‌ను హత్య చేసినట్లు DCP ప్రకాష్ రెడ్డి తెలిపారు.రెండ్రోజుల క్రితం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో హతుడు అసద్ ఖాన్.. తన స్నేహితుడితో కలిసి బుల్లెట్ బైక్ పై మైలార్ దేవ్‌పల్లి వైపు బయల్దేరాడు. ఇదే అదునుగా నిందితుడు యాసిన్ ఖాన్.. మరో ఆరుగురి సహాయంతో ఆటోలో వచ్చి అందరూ చూస్తుండగానే వేట కొడవళ్లతో అతి కిరాతకంగా హత్య చేసి పారిపోయారని DCP తెలిపారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







